పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోధబంధుర ధీయుగంధర భూధురంధరసింధురా
సాధునిగ్రహ భీమవిగ్రహ శాత్రవాగ్రహనిగ్రహా!

186


మ.

హరిసద్విక్రమచంద్రచేలవిధుభక్తాగ్రేసరా యబ్జసుం
దరపాణిద్వయసోమభూతియుతసన్నాధాసు(ను)జైవాతృకా
యరిహారాజకళానిధీ కుముదమిత్రాగోమదీశాన్వయా
హరిణాంకస్ఫుటబింబసన్నిభముఖా యానందరంగాధిపా!

187


క.

ఘననందసంతతిపయో, వననిధిరాకాశశాంకవాసవవిభవా
వనితాజనతానూతన, మనసిజయానందరంగమహిపతిచంద్రా!

188


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వర కరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చ
కులజలధికుముదమిత్ర వేంకటకృష్ణార్యపుత్త్ర శ్రీవత్సగోత్రపవిత్ర విద్వజ్జన
మిత్ర కుకవిజనతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీనలక్షణకవి కస్తురిరంగ నామ
ధేయప్రణీతం బైన యానందరంగఛ్ఛందం బను లక్షణచూడామణియందు సర్వం
బును జతుర్థాశ్వాసము.

ఆనందరంగరాట్ఛందము సంపూర్ణము.

చెన్నపురి: 'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము — 1918.