లక్ష్యము రఘుశబ్దమునకు భారతము, ఆదిపర్వమున —
మ. |
రజనీనాథకులైకభూపణుఁడవై రాజర్షివై ధారుణీ
ప్రజనెల్లన్ బ్రజవోలె ధర్మనియతిన్ బాలింపుచుం దొంటిధ
ర్మజు నాభాగు భగీరథుం దశరథున్ మాంధాతృ రామున్ రఘున్
విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాతపారిక్షితా!
| 28
|
బాహుశబ్దమునకు భారతము, విరాటపర్వమున —
గీ. |
నేల నాలుగుచెఱఁగుల నృపులకొలువు,లందు నేను వర్తించితి నవనినాథ
యగ్గలించి నాయెదురఁ బాహప్పళింపఁ, గడఁగఁజాలినమల్లుఅఁ గాన నెందు.
| 29
|
రాహుశబ్దమునకు భారతము, శల్యపర్వమున —
క. |
ఉర్వీచక్రము వడఁకెను, బర్వము లేకుండ రాహు భానునిఁ బట్టెన్
పర్వతము లురలె వరళులు, సర్వదిశల నరచె నభము శర్కర గురిసెన్.
| 30
|
ఊరుశబ్దమునకు భారతము, కర్ణపర్వమున —
శా. |
లీలన్ గేల నమర్చి మత్తగజకేళీసుందరోల్లాస మా
భీలత్వం బలరింపఁ ద్రిప్పుఁ జదలన్ బృథ్వీస్థలిన్ వైచు ముం
గాలన్ ద్రోచు మొగంబువ్రేయు దిశ లుగ్రస్ఫూర్తి వీక్షించు మో
కాలూరుం బయిఁ గ్రమ్మ నెక్కు మెడ నిక్కం ద్రొక్కు, లేచున్ నగున్.
| 31
|
మేరుశబ్దమునకు పాండురంగమాహాత్మ్యమున —
శా. |
మీఁదన్ దారధరాధరంబుగల యామేరు న్నగంజాలి త
త్తాదృక్తుం డరుచిన్ దలిర్చు ఖగయూధస్వామి హేమప్రభా
ప్రాదుర్భావశుభప్రదుండు మనుచున్ రామానుజామాత్యు శ్రీ
వేదాద్రీశు విదూరిమందిరు జగద్విఖ్యాతచారిత్రునిన్.
| 32
|
వ. |
అని యీరీతి నున్నది గనుకఁ దెలియునది.
| 33
|
గీ. |
పరగు నభిలాషశబ్దము భ్రమపదంబు, నొనరు స్త్రీలింగరీతి నొక్కొక్కచోట
భ్రమను సుందరు లానందరంగపతికి, వలచి రభిలాష యెట్టిదో వారి కనఁగ.
| 34
|
తా. |
భ్రమశబ్దము, అభిలాషశబ్దము అకారాంతములు గనుక నవి తెనుఁగులైనపుడు భ్రమము, అభిలాసము అని యండవలెను. అట్లుగాక భ్రమ, యభిలాష అని స్త్రీలింగశబ్దములవలెఁ జెప్పవచ్చును.
|
|
భారతము, ఆనుశాసనికపర్వమున —
క. |
భ్రమచే నద్దేవునిఁ జి, త్తమునం దిడి శరణు శరణు దయఁ గావుము న
న్నమితైశ్వర్య...
| 35
|