|
జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణ సేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్ధికరుండు గావుతన్.
| 353
|
15. 'ఉత్' అను నుపసర్గయందలి యచ్చుకు మనుచరిత్రమున —
క. |
కాంచి తదీయవిచిత్రో, దంచితసౌభాగ్యమహిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి, యించుక దరియంగ నచటి కేఁగెడువేళన్.
| 354
|
హల్లుకు భారతము, ఆరణ్యపర్వమున —
చ. |
పటువిశిఖంబులం ద్రిదళపాలతనూజుఁడు పంది నేసెఁ దా
నటు పరమేశ్వరుండును రయంబున దానికి మున్నె యేసె నొ
క్కట పడియెన్ హరార్జునుల ఘోరశరంబులు పందిపైఁ గుభృ
త్తటముపయిన్ వడిం బడునుదగ్రమహాశనులట్ల మ్రోయుచున్.
| 355
|
16. 'ఆజ్' అను నుసనర్గయందలి మచ్చుకు అల్లసాని పెద్దన హరికథాసారము —
క. |
బాలరసాలకిసాలముఁ, గ్రోలుచుఁ బలికెడిపికం బకో యనఁ జాలా
జాలిపడియాన యతిమధు, రాలాపము లనియె నాదరణమున వినఁగన్.
| 356
|
హల్లుకు నాచనసోమన హర(ర)విలాసమున —
క. |
మౌనితిలక! సజ్జనసం, తానమహీరుహ! భవత్సుధాలాపము నా
వీనులకు విందొనర్చెన్, మేనుగఁ గలతాపమణఁచె మృషగాదు సుమీ.
| 357
|
17. 'వి' అను నుపసర్గయందలి యచ్చుకు మనుచరిత్రమున —
మ. |
అతఁ డావాతపరంపరాపరిమళవ్యాపారలీలన్.
| 358
|
హల్లుకు భారతము, సభాపర్వమున —
క. |
ఉపగతశుద్ధులు పాప, వ్యపగతబుద్ధులు వినీతివంతు లసములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.
| 359
|
18. 'అతి' అను నుపసర్గయందలి యచ్చుకు భారతమున —
చ. |
ఇనసమతేజు లై ధరణి నెన్న నధర్మపథంబుచక్కిఁ ద్రొ
క్కనిభరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి య
త్యనఘచరిత్ర! యిట్లు తగునయ్య! యధర్మము సేయ నీ వెఱుం
గనినృపధర్మము ల్గలవె కౌరవపుంగవ గౌరవస్థితిన్.
| 360
|