హల్లుకు భీమన హరవిలాసమున —
క. |
భువిలో మిత్రుం డగువాఁ, డవిరతమును వేఱులేక యాత్మీయమహో
త్సవముఖకృత్యంబుల న, ధ్యవసాయం బెఱుకపఱుపఁ దగు సంప్రీతిన్.
| 346
|
12. 'ని' అను నుపసర్గయందలి యచ్చుకు సునందనోపాఖ్యానమున —
క. |
భూతలపతి మదిలోపల, నీతముఁ బాలించి యమ్మెయిన్ విప్రగురు
వ్రాతముల ధనములంతయు, నాతతతదుర్మతి హరించి యలమట నిడియెన్.
| 347
|
హల్లుకు సునందనోపాఖ్యానమున —
గీ. |
నిఖిలజనములు గనుఁగొన నీబలంబు.
| 348
|
13. 'ఉప' అను నుపసర్గయందలి యచ్చుకు జైమినిభారతమున —
ఉ. |
అఱ్ఱున వింటినారి బిగియం దగిలించి విరోధిమోముఁ గ
ట్టెఱ్ఱవహించుకన్నుల నిరీక్షణ మొప్పఁగఁ దెచ్చి వేఁటకాఁ
డిఱ్ఱియుఁబోలె నవ్వుచు నుపేంద్రుని ముందటఁబెట్టి వీఁడుగో
గుఱ్ఱపుదొంగ వచ్చె సమకొన్నప్రతిజ్ఞ వహించె నావుడున్.
| 349
|
హల్లుకు దశకుమారచరిత్రమున —
ఉ. |
ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁబోరి రాజిలోఁ
గాముఁడు శంబరుండు శశిఖండధరుండు గజాసురేంద్రుఁడున్
రాముఁడు రావణుండు సురరాజతనూజుఁడు సింధునాథుఁడున్
భీముఁడు దుస్ససేనుఁడు నుపేంద్రుడు కంసుఁడు బోరునాకృతిన్.
| 350
|
మఱియు, అల్లసాని పెద్దన —
గీ. |
అఖిలపారికాంక్షికాశ్రయపర్ణశా, లోపకంఠమునకు లోకకర్త
చేర నేఁగి యచట వారువంబును డిగ్గి, యధివసించి యుండునట్టియెడను.
| 351
|
14. 'అభి' అను నుపసర్గయందలి యచ్చుకు భాస్కరుఁడు నందనోపాఖ్యానమున —
గీ. |
ఇప్పు డేనుదలఁచినయభీష్ట మెల్లఁ, జేకుర నొనర్చి నీవు రక్షింపవయ్య.
| 352
|
హల్లుకు విజయసేనమున —
ఉ. |
అల్లనఁ దొండ మెత్తి శివు నౌదలయేటిజలంబుఁ బుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠమున పొంతనయున్నసహస్రనేత్రుపైఁ
|
|