పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మనుచరిత్రమున
మ.

గవిలో..........రెం
డవకాండంబున నార్తియున్ గినుక డాయన్ వచ్చి కౌక్షేయక
ప్రవిభిన్నం బయి యోలిఁ గూలెఁ బనిధారాకీర్ణశైలాకృతిన్.

257
కాశీఖండమున
మ.

... రెండవకైలాసముఁబోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్

258
[1]అనంతచ్ఛందమున
గీ.

కృష్ణుఁ డిచ్చె నాలుగేసికోకలు కూర్మి, యింతులకును నాలుగేసిమణులు
ఠీవితోడ దోసెఁడేసిరూకల కడు, నిం పెసంగ గంపెఁడేసి సొమ్ము.

259


వ.

అని వున్నది గనుక సూచన తెలియ వ్రాసినాను.

260

చక్కటియతి

నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

పుఫుబుభులకు ముకారంబు పూర్వమునను
గాని పైగాని చెప్పఁ జక్కటియతియగు
ముప్పిఁ గొని కృష్ణుఁ డురమునఁ బొడిచె ననఁగ
బుధుల వినుతులఁ దగె వ్యాసముని యనంగ.

261


తా.

పు, ఫు, బు, భు యీ నాలుగక్షరములు ముందుగావున్నా వెనుకనున్నా యతి చెల్లును.

లక్ష్యము
గీ.

మొనసి యానందరంగభూభుజునికీర్తి, భువనముల నాక్రమించిన మురహరుండుఁ
బురహరుండును దమగీము లరయలేక, నధివసించిరి యతనిచిత్తాబ్జమునను.

262
భాస్కరరామాయణమున
మ.

అనుచున్ జేరఁగ వచ్చి లక్ష్మణ వృధాయాసంబు నీకేల వే
చను మెచ్చోటికి నైన నీతరమె దోస్పారంబునన్ బోరఁగా
నను మున్నీవు నెఱుంగు దారయఁగ నానాగాస్త్రపాశంబు లే
పున బంధించినవన్నియున్ మఱచితే మోహంబునం గల్గునే.

263
శ్రీరంగమాహాత్మ్యమున
క.

అనుటయు నాగంధర్వుఁడు, మునివర! శ్రీకృష్ణుఁ డఖిలభూతావళియం
దును బాయకుండునేనియుఁ, గనరామి యదేమి యనినఁ గాశ్యపుఁ డనియెన్.

264
  1. ఈపద్యము అనంతచ్ఛందమున లేదు. అప్పకవీయములో కావ్యచింతామణియందు అని ఉన్నది (చూ.3-220).