లక్ష్యము —
గీ. |
అనఘ యానందరంగ! మార్తాండతేజ, యవుర నీశౌర్యమునకు వేదండవైరి
స్వాంతమున భీతిఁ జెంది మహాగుహాంత, రమున దాఁగెను మిగులఁ జిత్రంబుగాను.
| 240
|
భారతము, ఆదిపర్వమున —
మత్త. |
దండితాహితవీర సూరినిదాన దానవినోద కో
దండపార్థ పరాక్రమ ప్రియ ధామదిక్పరిపూరితా
ఖండపాండుయశోనిధీ పరగండభైరవ వైరివే
దండతుండవిదారిఘోరతరాసిభాసినిజంగుళా!
| 241
|
భారతము, భీష్మపర్వమున —
ఉ. |
పాండునృపాలనందనుల పావని మున్నుగ నేచి యప్డు భీ
ముండు కడంకమై నడుచుచోటికిఁ జక్కటిగాఁగఁ ద్రోచి యొం
డొండఁ గడంగి సేన తమయుబ్బున కుబ్బగ నన్యసైన్యవే
దండముఖాంగముల్ దృణవితానముగాఁ గొని నిర్వికారులై.
| 242
|
భారతము, విరాటపర్వమున —
ఉ. |
స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాఁగ శంక యా
వంతయు లేక......
| 243
|
శృంగారనైషధమున —
గీ. |
అధికరోషకషాయితస్వాంతుఁ డైన, నరపతికి విన్నవించకు నాయవస్థ...
| 244
|
భారతము, ద్రోణపర్వమున —
మ. |
ధరణీచక్రము దిద్దిరం దిరిగె మార్తాండుండు కుంఠీభవ
త్కిరణుండయ్యె దిశావితానము వడంకెన్...
| 245
|
సారంగధరచరిత్రమున —
ఉ. |
...సారంగధరా యనన్ గువలయప్రమదం బగు....
| 246
|
బహుళాశ్వచరిత్రమున —
ఉ. |
ఇందఱి మించి పల్కెదు మనీషివె...
| 247
|
వ. |
అని యీరీతి వారువారు మహాకవులు చెప్పిరి గనుక లెస్సఁగాఁ దెలియగలది.
| 248
|
సంయుక్తయతి
భీమనచ్ఛందమున (సంజ్ఞ. 71) —
క. |
వెలయఁగ సంయుక్తాక్షర, ములలో నెద్దాని నైన మునుకొని వడిగా
నిలుపఁగ నగుఁ బాదమ్ముల, నలఘుపరాక్రముఁడ రేచనా! వినయనిధీ!
| 249
|