పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కళాపూర్ణోదయమున
ఉ.

కావునఁ జంద్రుఁ గింద్రుఁ జిలుకన్ గిలుకన్ బికమున్ గికంబునుం
గావు మటంచు వేఁడకుఁడు కీరపుజాతికిన్ బ్రియం
బే వివరింప మీకుఁ బలెఁ బెంచినజాతికి ముద్దుగాక పెన్
బావురుబిల్లికిన్ గలుగునా మొకమోట మొకింత చిల్క పైన్.

207
మన కూర్మ పురాణము; మలయమారుతమున
క.

తలిరాకుఁబోఁడినిడుక, న్గెలఁకులఁ గర్ణాగ్రపాళి నీలాంబురుహం
బల రె నది యెట్టులన దృ, క్కుల కిది తులగామిఁ జేరి కొలుచువిధమునన్.

208
భారతము, అశ్వమేధపర్వమున(1)
చ.

అనుమతి యింక వేఱె పడయన్ గత మెయ్యది కౌరవేంద్ర నన్
బనుపుము వాజిమేధకరణంబున కెయ్యది సేయువాఁడ నీ
యనుజులు...

209


వ.

అని యున్నది గనుక నీజాడఁ దెలిసి యతులు చెప్పవచ్చును.

210

ప్రాదియతి

[1]కవిరాక్షసచ్ఛందమున
గీ.

ప్రాదినిత్యసమాసశబ్దములు గాక, పెఱపదంబులపై యచ్చు బెరసినప్పు
డన్నియునుస్వరయతులగు సాంబశివుఁడు, శ్రీశుఁ డమరాన్వయాబ్ధిపూర్ణేందుఁ డనఁగ.


తా.

సాష్టాంగము, సాహంకారము, సాంబశివుఁడు, సాంగోపాంగము, సాటోపము యివిమొదలైనవానియందు అద్యక్షరహల్లుతో అచ్చుకూడి ఉన్నందున హల్లునకైనను, అచ్చునకైనను యతియుండ జెప్పితే ప్రాదియతి యగును గనుక రెంటికి లక్ష్యము.


గీ.

అమలభక్తితోడ సాష్టాంగముగఁ బూని, సాంబమూర్తి దివ్యచరణములకు
దాసులెల్ల మ్రొక్కుదారి మ్రొక్కిరి నీకుఁ, బ్రబలు లైనరిపులు రంగనృపతి!

212
మఱియు, కేతన కాదంబరియందు
గీ.

జనవరేణ్యుఁ గాంచి సాష్టాంగ మెఱఁగిన, నావిభుండు వాని లేవనెత్తి
కౌఁగిలించి వానిఁ గనుఁగొని కేయూర, కాభిధాన మొసఁగెఁ [2]గౌతుకమున.

213
నాచనసోముని హరివిలాసమున
క.

శంబరవైరివిభంజన, సాంబశివా యంధకప్రశాసక గజచ
ర్మాంబరధర యని నీదుప, దంబులు పూజించువాఁడు ధన్యుఁడుసుమ్మీ!

214
  1. ప్రతులలో ఇట్లే ఉన్నది గాని ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ. 1-92).
  2. కడుముదమున