పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముక్కుతిమ్మన వాణీవిలాసమున
క.

తెఱవా తరువాతను గ్ర, చ్చఱ నీనాయకుడు వశ్యుఁ డగు నెట్లంటే
మఱువక విను కలఁ గాంచిన, తెఱఁగెల్ల నటంచుఁ దేటతెల్లమి గాఁగన్.

183
భారతము, విరాటపర్వమున
క.

ముఱిముఱి చీఁకటియప్పుడు, నఱిముఱి సుభటులు గడంగి యని సేయంగా
మెఱసి తమ మెల్లచోఁ గ్రి, క్కిఱిసిన మఱి పాఱి నిలిచి రింతను వంతన్.

184


వ.

అని మఱిన్ని అనేకప్రబంధములయం దున్నది గనుక తెలుసుకోగలది.

185

మకారయతి

[1]గోకర్ణచ్ఛందంబున
గీ.

యరలవశషసహార్ణము లాదిబిందు, యుతము లై మవర్ణవిరామయుక్తి నలరు
మారుతాత్మజుఁ డరిదిసంయమి యనఁగ, మదనజనకుఁడు దితిజసంహరుఁ డనంగ.

186
మఱిన్ని, గావ్యచింతామణియందు
క.

సున్న యనంగ మకారము, పన్నుగ శషసహలమీఁదఁ బ్రభవించిన యా
సున్న మకారంబునకు, గొన్నిట మవడియని చెప్పుకొందురు సుకవుల్.

187


తా.

యరలవశషసహలకు దాపలసున్నలు కలిగి మకారమునకు యతిగాఁ జెప్పవచ్చును. ఎటువలెనంటే సంయమి, సంవాసము, సంవాసము, సంశయము, సంసారము, సంహరణము ఇవి మొదలయినశబ్దములయందలి దాఁపలసున్న గలయక్షరములు
మకారముతో యతి చెప్పవచ్చును.


గీ.

మహితభక్తవత్సలత సంయములఁ బ్రోచు, మాధవునివలె విగతసంశయతశ్రితుల
మనుపుచు నరాతిదంతిపింహమయి మించె, మహిమ రంగేంద్రుఁ డర్థసంసక్తిఁ గొనక.

188
ఆదిమకవి భీమన చాటుధార
చ.

గరళపుముద్దలోహ మన గాఢమహాశనికోట్లు సమ్మెటల్
హరునిటలాగ్ని కొల్మి యురగాధిపుకోరలు పట్టుఁగార్లు ది
క్కరటిశిరంబు దాయి లయకారుఁడు కమ్మరి వైరివీరసం
హరణరణాభిరాముఁ డగు మైలముభీమనఖడ్గసృష్టికిన్.

189
  1. ఈపద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పినట్లున్నది (చూ.1-117). అప్పకవీయములో అనంతునిఛందమునందు అని ఉన్నది (చూ. 8-77). సులక్షణసారములో పెద్దిరాట్ ఛందమున అని ఉన్నది.