పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మనుచరిత్రమున
ఉ.

ఇంతలు......................................యే
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు...

174
నంది సింగన వామనపురాణమున
క.

కాంతాలలామ నీ కే, కాంతంబునఁ బల్కరింతుఁ గల్గినకార్యం
బంతయు ముదమలరఁగ విను, మంతట నీమదికిఁ దెలివిడై యుండు సుమీ!

175
వరాహ(వామన)పురాణమున
గీ.

.... తత్తరమున నాపోశన మెత్తఁబోయి, భూసురుం డెత్తె నుత్తరాపోశనంబు.

176
భారతము, ఆదిపర్వమున
గీ.

కామభోగములకును నేకాంతగృహము, పొలుపుమీఱిన ధర్మార్థములకు నిదియె
యాస్పదంబును వర్ణత్రయానిరుద్ధు, లయినజనుల నెంతయు నొప్పు నప్పురంబు.

177


వ.

అని మఱిన్ని అనేకప్రబంధముల నున్నది గనుక జాడ తెలియునది.

178

దేశ్యయతి

కావ్యాలంకారచూడామణి (7.89)
చ.

కఱకరి [1]కల్లడంబు కడుఁ గట్టిఁడి తెమ్మెర యోలమాస గ్ర
చ్చఱ యెసలా[2]రజంబెఱకులారడి వీఱిఁడి రజ్జులాఁడు క్రి
క్కిఱియుట నాఁ దెనుంగునకు నీయుభయంబు యతిప్రకాశమై
మెఱయుఁ గవిప్రయోగముల మేర లెఱింగి రచింపనేర్చినన్.

179
మఱియు నథర్వణచ్ఛందంబున
గీ.

దేశ్య తెలుఁగులందుఁ దెలియ నొక్కొకచోట, హల్లులోన నచ్చు లణఁగియుండు
నట్టిచోట రెండు నమరు వళ్లకుఁ జెప్ప, నాదిసుకవివరులయనుమతమున.

180


తా.

తెమ్మెర, ఓలమాస, క్రచ్చఱ, ఆఱడి, వీఱిఁడి, క్రిక్కిఱిసి అనునీమొదలుగాఁగల దేశ్య తెనుఁగుశబ్దములయందు హల్లులలో నచ్చులైన స్వరము లిమిడియుండుటచేత ఆచ్చుకు హల్లుకు ఆయక్షరమునే యతిగా జెప్పనగు ననుట.


క.

దొరలదొర యనఁగ విని గ్ర, చ్చఱ విజయానందరంగ హంవీరునియ
బ్బరపునగరివాకిటఁ గ్రి, క్కిఱిసి కవుల్ కాచినా రహీనప్రౌఢిన్.

181
భారతము, అనుశాసనికపర్వమున
క.

అతిథి నిను వచ్చి వేఁడిన, మతిఁ గింకిరి పడక యోలమాసగొనక స, మ్మతితో...

182
  1. ప్రల్లదంబు
  2. రులుల్లుఱుకులాడెడి