పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట


ఆంగ్లంలో నాచే రచించబడ్డ "The History of Modern Andhra Pradesh" అన్న గ్రంధానికి తెలుగు అనువాద రూపమే ఈ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ గ్రంధం ఎం. ఎ. విద్యార్దుల్ని, వివిధ పోటీ పరిక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల్ని ఉద్దేశించి ప్రత్యేకంగా రచించబడ్డది. వీరేగాక ఆంధ్రప్రదేశ్ లోని సామాన్య పాఠకులు సైతం ఈ గ్రంధాన్ని సమాదరిస్తారని భావిస్తున్నాను.

గ్రంధాన్ని అనువదించడంలోను, వ్రాతపతినిసిద్దంచేయడంలోను సహకరించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ చరిత్రశాఖలోని నా మిత్రులు శ్రీ కె గజేంద్ర రెడ్డి, సి. రవీంద్రనాధ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ తెలుగు అనువాద రూపాన్ని వెలుగులోకి తేవడానికి అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిర్ణీత సమయంలో చక్కగా ప్రచురించినందుకు M/S Sterling Publishers (Pvt) Limited, New Delhi అధినేతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

పి. రఘునాధరావు