పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉద్గతోంత ఉదంతోత్యంత నీచజాతి స్తత్ర భవా ఉదంత్యా:, తే బహవో నేకవిధా వైశ్వామిత్రా విశ్వామిత్ర సంతతిజా దస్యూనాం తస్క రాణాం మధ్యే భూయిష్ఠా: అత్యధికా:."

తా|| "ఆ విశ్వామిత్రునకు నూర్గురు పుత్రులుండిరి. అందు మధ్యముడైన మధుచ్ఛందుడు జ్యేష్ఠుడుగా గల చిన్న కొడుకులు ఏబదిమంది,జ్యేష్ఠులు ఏబదిమంది. విశ్వామిత్రుడు తనతో తెచ్చిన శునశ్శేఫుని జ్యేష్ఠునిగా చేసి వానియాజ్ఞకు బద్ధులై యుండునట్లు తన పుత్రులను కోరెను. జ్యేష్ఠపుత్రు లేబదిమందియు తండ్రి యాజ్ఞను మన్నింపలేదు. (మన్నింపక పోగా హేళనము చేసిరి). అందులకు విశ్వామిత్రుడు కోపించి తన యాజ్ఞను పరిపాలింపక నిరాకరించిన జ్యేష్ఠపుత్రు లేబదిమందిని గూర్చి శాపరూపమైన ఈ దిగువ వాక్యమును పలికెను.

"పిత్రాజ్ఞాతి క్రమణ మొనర్చిన ఓ జ్యేష్ఠ పుత్రులారా! మీరలును మీ సంతాన పరంపరయు (పుత్రపౌత్రాదిగా గల మీ వంశములలో రాగల తరముల వారందరు అని అర్థము). చండాలాది రూప బాహ్య జాతులుగా నయ్యెదరు గాక!"

"ఆ శాపము వలన వారు అంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబా మొదలైన జాతులుగా మారిపోయిరి. 'ఇతి' శబ్దమువలన పైన పేర్కొనబడిన ఐదు బాహ్యజాతులే కాక యింకను ఇతరముగా నున్న బాహ్యజాతు లన్నియుకూడ చెప్పబడినవి. (అట్టి జాతులానాటికి అరువది నాలుగు గలవు. అని తెలియవలెను. వారందరు అట్టి బాహ్యజాతులలో కలిసి వారిలో లీనమైపోయి రని తాత్పర్యము). వార లందరును అంత్యజాతులలో జన్మాంతరములయందుకూడ ఉదయించు చుండిరి. శాపగ్రస్తులైన విశ్వామిత్రుని సంతానమువలన బుట్టినవారి వంశపరంపర లన్నియు 'దస్యులు' అనబడు దారులుగొట్టిజీవించెడి దొంగలలో అత్యధికులుగా నుండిరి. అని బ్రాహ్మణమే చెప్పుచున్నది. ఇది ఐత రేయ బ్రాహ్మణములో గల చరిత్ర. తండ్రిని ధి:కరించిన కుమారులు ఉత్తమమై తపోజ్ఞానాదులతో గూడిన కులమును వీడి అనాగరికులై చౌర్య హింసాదులు వృత్తిగా గలిగి వివేక విహీనులై అరణ్యముల