పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారంభమునకు పూర్వము 36 వత్సరముల క్రిందట జరిగియున్నది. కలిశకము క్రీస్తునకుపూర్వము 3102 సంవత్సరములలో ప్రారంభించినది. క్రీ. పూ. 3102 + 36 = క్రీ. పూ. 3136 సంవత్సరము భారతయుద్ధకాలము. భారతయుద్ధము ముగియగనే క్రీ. పూ. 3138 సంవత్సరములోనే మగధలో బార్హద్రథవంశములో సోమాధి లేక మార్జారి యనువాడు మగధకు రాజధానియగు "గిరిప్రజ" పట్టణమున పట్టాభిషిక్తుడై నట్లు మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత, విష్ణు, కలియుగరాజ వృత్తాంతాది గ్రంధములు చెప్పుచున్నవి.

మగధ రాజ వంశములు

వంశము పేరు రాజుల సంఖ్య రాజ్య కాలం క్రీ. పూ. నుండి - వఱకు
1. బార్హద్రథ వంశము 22 1006 3138 - 2132
2. ప్రద్యోతవంశము 5 138 2132 - 1994
3. శిశు నాగ వంశము 10 360 1994 - 1634
4, నందవంశము, మహాపద్మనంద, ఆతనికుమాళ్ళు 8 మంది వెరశి 9 మంది వీనిని రెండుతరములుగా చారిత్రకు లెంచుచున్నారు. 2 100 1634 - 1534
5. మౌర్యవంశము, చంద్రగుప్తమౌర్యునితో ఆతని వంశమువారు 12 316 1534 - 1218
6. శుంగవంశము 10 300 1218 - 918
7. కాణ్వవంశము 4 85 918 - 833
8. ఆంధ్రవంశము 32 506 833 - 327
9. ఆంధ్రభృత్యవంశము - వీరే గుప్తవంశపు రాజులు 7 245 327 - 82