పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వంశము పేరు రాజులసంఖ్య రాజ్యకాలం క్రీ. పూ. నుండి - వఱకు
10. పాన్వారు లేక పరమారవంశములో ఎనిమిదవాడగు విక్రమాదిత్యుని లగాయితు 24 1275 82 - క్రీ. శ. 1193 వఱకు

పైజాబితాలోని మగధసామ్రాజ్యమును పరిపాలించిన రాజ వంశములలో ఎనిమిదవది ఆంధ్రవంశము. మనకు ఆంధ్రులను పేరువచ్చుటకు కారణమైన ఆంధ్రరాజులగాయతు ఆంధ్రరాజ్యము ప్రత్యేకముగా ఆర్యాంధ్ర రాజులచే పరిపాలింప బడుచుండినది. ఆంధ్రరాజులగాయతు రాగారాగా మనకు తెలియవచ్చిన ఆంధ్రదేశచరిత్రకాలము కలిశకము 2269 సం|| (అనగా క్రీ. పూ. 833 సం||) ఐయున్నది. చివరి కాణ్వరాజు కొలువులోనుండిన శ్రీముఖు డనెడి ఆంధ్రుడు మగధ చక్రవర్తియైన కాణ్వరాజు 'సుశర్మ' యనువాని కొలువులో చేరి క్రమక్రమముగా మగధసామ్రాజ్యమునకు ముఖ్యమంత్రియు, సేనాష్యక్షుడు నాయెను. ఆతడు మగధరాజుల కొలువులో ఆంధ్రసైన్యములను చేర్చి కొంతకాలమునకు చివరి కాణ్వరాజగు సుశర్మను సంహరించి ఆంధ్రసైన్య సహాయమున తాను మగధసామ్రాజ్యమునకు చక్రవర్తి యాయెను. ఆనా డాసేతుహిమాచలముగా గల భరతఖండ మంతయు మగధచక్రవర్తులకు లోబడి యుండెడిది.

శాతవాహన చక్రవర్తులు

మగధసామ్రాజ్యమును పాలించిన ఆంధ్రచక్రవర్తులను శాతవాహన, శాతకర్ణు లనెడి బిరుదులతో పురాణములు వర్ణించుచున్నవి. ఈ చక్రవర్తుల శాసనములలో కూడ ఆబిరుదులే కనబడుచున్నవి. ఈ వంశమునకు "ఆంధ్ర శాతవాహన వంశ" మని పేరు. 'శాత' మనగా సింహము. దానిని వాహనముగా గలవాడు "శాతవాహనుడు" లేక శాతవాహనుని బొమ్మను జాతీయజండాగా గల రాజులు "శాతవాహనరాజులు" సింహముపై నెక్కిన యోధుని బొమ్మతోగూడిన జాతీయజండాను కలిగినందున వీరికి "శాతవాహను"లను బిరుదు కలిగినట్లు బుద్ధిమంతు లూహించుచున్నారు. ఆంధ్రజాతి మృగములలో