పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

15. 'ఆంధ్ర శాసన సారస్వతము లందలి ఉర్దూ మరాఠీ పదములు (క్రీ.శ. 1800 వఱకు)' (1967)

రచయిత : డా.ఎల్. చక్రధరరావుగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఆంధ్ర సాహిత్యము నందును, తెలుగు శాసనము లందును ప్రయుక్తమైన ఉర్దూ, మరాఠీ, ఒరియా భాషా పదముల చరిత్రము వివిధ కోణముల నుండి పరిశీలించిన సిద్ధాంత వ్యాసము.

16. 'తెనాలి రామకృష్ణుని గ్రంథములు' (1967)

రచయిత : డా.ఇ. కృష్ణమాచార్యులుగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం గూర్చి సంపూర్ణ పరిశోధనయిది.

17. 'నన్నెచోడుని కుమార సంభవము' (1967)

రచరిత్రి : డా.టి. నిర్మలగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

నన్నెచోడుని కుమార సంభవం గురించి యిది సమగ్ర పరిశోధన.

18. 'తెలుగులో ఉత్తర రామాయణములు' (1968)

రచయిత : డా.ఎం. పాండురంగారావుగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

తిక్కన, కాచవిభుడు విఠలరాజు, కంకంటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణముల సమగ్ర సమీక్ష యిది.

19. 'పాల్కురికి సోమనాథుఁడు - అతని గ్రంథములు' (1969)

రచయిత : డా.పి. ఏరేశలింగంగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

వీరశైవ రచయితలలో అగ్రగణ్యుడైన పాల్కురికి సోమనాథుని గ్రంథములన్ని యిందులో పరిశీలింపబడ్డవి.

20. 'కరుణ రసము - ఆంధ్ర వాఙ్మయము' (1970)

రచయిత : డా.ఎస్. రాధాకృష్ణగారు

పర్యవేక్షకులు : ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు

ఆంధ్ర వాఙ్మయములో కరుణరస పోషణ ఏయే గ్రంథాలలో ఏయే విధంగా ఉందో, ఇందులో విశదీకరింపబడి యున్నది.