శ్రీ ఇజ్జత్ అనార్ కందుకూరి బాలసూర్య ప్రసాద రావు బహద్దర్ : దేవిడీ జమిందార్ వారిచే రచింపబడిన -ఆంధ్రవిజ్ఞానము లేక తెనుగు ఎన్సెక్స్లో పేడియా అను గ్రంథమునకు
పీఠిక
(ప్రస్తుతము ఆంధ్ర విశ్వకళావధీనత్తుకు వైస్ ఛాన్సలర్ గానున్ని శ్రీయతులు డాక్టు కట్టగుంచి రామలింగారెడ్డి గారిచే ఆంగ్లమున వ్రాయబడిన పీకకు శ్రీయతులు డాక్టరు పోచిరాజు రాజేశ్వరరావు యం. ఓ., ఓ. యస్. గారిచే శ్రీ ఇజ్జత్ అసాక్ కందుకూరి బాలసూర్య ప్రసాదరావు బహద్దర్, జమానా కు వారు " ఆంధ్ర దేశములో మిక్కిలి పేరు ప్రఖ్యాతులు గాంచి గణింపదగిన పురుషవరేణ్యులలో ముఖ్యులు. వారే యీ ఆంధ్రవిజ్ఞాన గ్రంథరచనా ధురంధరులైన కవిబ్రహ్మలు. అట్టి గ్రంథమును ప్రజా సముదాయమునకు పరిచయము చేయగలుగు అవకాశముపొందిన నా భాగ్యమే భాగ్యము. వీరుమన దేశములో చిరకాలమునుండి పరిపాలించుచు పేరు వద్ద పెద్ద జమీన్ దారుల కుటుంబ ములలో నౌకరు. వీరి తాతలుసు, వారి తండ్రులును, జరిగిపోయిన ఒక కాలనుందు హైదరాబాదు నైజాములదగ్గర అమాత్యశేఖరులుగానుండి, బిరుదములు పొందిరి. వారి కుటుంబ చరిత్ర యొక్క లింక నిదర్శనములు, 3 సం॥ము వరకును, అంతకుముందు గనుకూడ, కానవచ్చుచున్నవి. కాని పురాతనమే సదా విచారణీయమైన బిరుదుగా తలంపరాదు. వ్యక్తిగత గుణశీలములే ముఖ్యముగా గనునింపవలసిన విషయములు, ఈ సమయమున మహామతియగు డిస్ప్లే రెలీ గారు "నేను విఖ్యాతిగన్న సంశలుయొక్క సంతతి పరంపరలో నోకనిగా నుండుటకన్న, అట్టి వంశమునకు నే నాది పురుషుని గానుండుటకే ఇచ్చగింతును”, అను గర్వించదగిన వాక్యములు స్మరింపదగినవి. శ్రీ బాలసూర్య ప్రసాదరావు బహద్దర్, అనేకులను ఇతర జమానా కులవలె ఒక్క జమీన్ దార్ మాత్రమే కారు: సర్వతోముఖముగు వారి విజ్ఞానము, ఆ విజ్ఞానముందు వారికి గల అసాధారణమగు సంపూర్ణత్వము, వారి తెనుగు రచనా కౌశలమునకు, తెనుగు కవిత్వమునందు మంచి ఉన్నతస్థానము నొసంగినవి. ' ఈ ఆంధ్ర విజ్ఞానమునకు కర్తలు ఈ జమీన్ దారు వారని యిదివరకే నేను వ్రాసి యున్న సంగతిని గమనింపవలెను. ఇట్టి విజ్ఞానసర్వస్వములు ఇంత వఱకును పలువురు మేధావులచే రచింపబడి, ఒక వ్యక్తిచే క్రోడీకరింపబడుచున్నవి. ఇపు డీగ్రంథ మట్ల గాక, మేధానిధియా శ్రీజమీన్ దారు వారిచే స్వయముగా ఆదినుండి అంతమువరకును వ్రాయబడి, సంపుటీకరింపబడినది. ఈ శక్తి నూనవాతీతము, సంతత గ్రంథావలోకనమువలన గలిగిన తమ పాండిత్యమునకు శ్రీవారు తమవివిధ దేశపర్యటన మువలనను, ఆయా దేశవాసులతో కలసి మెలసి తిరుగుట వలనను, కలిగిన 5 విజ్ఞానశలమును సమన్వయము చేసికొనియున్నారు. వీరి పర్యటనములలో గూడ, శ్రీవారి పాండిత్యదృష్టియే వీరి దేశదర్శన కుతూహలకంటె అధికముగా కానవచ్చుచున్నది. పురాతన నాగరితకలకు పుట్టి నీళ్ళగు ఈజిప్టు, ఇటలీ, గ్రీసు, అరేబియా, పాల స్టెయిన్, మొదలుగాగల గొప్ప దేశములపై వారిదృష్టి ప్రసరించెను, చారిత్రక నిదర్శనములతో, ఈ దేశములనుండి, వివిధ నాగరికతా నదీ . లలామములు' వుట్టి మానవజాతియొక్క ఆధ్యాత్మిక, ఆధి భౌతికపిపాసను తనివిదీర తీర్చి, జగదేక సుందరముగ నీ ప్రపంచములో ప్రవహించినవి.