పుట:ఆంధ్రవిజ్ఞానము 01 1938.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవిశె

196

ఆవెస్తా

టకుఁ దగినంత నూలును, పట్టును, ఉన్నియును మనదేశమున లభించుచున్నవి. కాని పై నివివరిం చిన సన్న విడినార బట్టలను నేయఁదగిన నాక మాత్ర బుంకను లభింపలేదని ప్రత్యేక పరిశోధ కులు చెప్పుచున్నారు.

పూర్వకాలమున మనఋషులు కేవలము వల్కలములను, నారచీరలనే యుపయోగించుట వానియం దెన్నియో సుగుణము లుండఁ బట్టియే యని మన మూహింపవచ్చును. మరియు నీజిప్టు దేశస్థులు నారబట్టల యుపయోగమును మన పూర్వులవలననే గ్రహించి వారిదేశమున సమృద్ధి గా వాడుకొనుచున్నారు.
తెల్లని నారబట్ట పవిత్రమైనదనియు, శరీర మునకు సుఖావహరుగునదియు గనుకనే సకల జనులకు దానిపై వ్యామో హము గలుగ సాగినది. బట్టలనేత కుపయో గించు నారలలో ప్రధానమైనది అవిసెనార ఈనార యూరపు ఖండము నందును, అమెరికా యందును విశేషముగా లభించుచున్నది. దీని కాంగ్లేయ భాషలో ప్లాక్స (Flax) నియు, దీని గింజలకు లిన్ సీడ్సని (Lin Seeds) యు నందురు.
వడికి, నేతకుపయోగించునటు సిద్ధపరచిన వెనుక ఈ నారకు లినెన్ (Linen) అని పేరు. ఈ చెట్టునకు అవిసె లేక అగిసె అందురు. ఈ చెట్టు విత్తులవలన దీయఁబడు నూనె మన దేశమునందు గూడ సుప్రసిద్ధమయి : యున్నది. గంగాతీరమున నీగింజలనుండి నూనె తీయుటకే యీ చెట్లను పెంచుదురు. నూనె కొఱకు గింజల నాసించిన యెడలఁ జెట్లకు నారకాసించిన యెడల నూనెకు గింజలు పనికిరావు. నారయు, నూనెకు గింజ లును గూడ లభించున ట్లమెరికా ఖండమువారు కొత్తగా నేదో మార్గము కనిపెట్టిరట. ఈ

యనిసె గింజలు పిండిచేసి, యుడికించి వ్రణము లకు గట్టిన అది శులభముగా పగులును. శీత జ్వరములకు, దీని కషాయము మంచిది. నూనె రంగులు వేయుట యందుపయోగింపఁ బడును. నూనె యాడిన వెనుక మిగిలిన పిండి పశువుల మేతకుఁ బనికివచ్చురు. గింజలవలస నిట్టి యుపయోగము లన్నియు నటుండ, చెట్టు నారవలన నుపయోగము మరియు నధికముగా నున్నది
నారఱ కవిసె విత్తులకు చైత్ర వైశాఖ వశాసములలో జల్లవలయును. ఆ మొక్కలు భాద్రపద మాసాంతమునకు నారకు పయోగించు దీని పెరుగురు.. ఈ యనిని చేలు వర్గా కాలారంభమున చిన్న చిన్న నీలిరంగు పువ్వు లతో కన్నులవిందు చేయుచుండును. భాద్రపద మాసొంతమునకుఁ గాయలుకాచి, మొక్కలు ముదిరి 20, 80 అంగుళముల పొడుగును మొక్కలు చున్నపుడు వాని పసుపురంగు వాల్చుట కారంభించగనే పెరికివేయ వలయును. అప్పటికి గింజలు కూడ ఆకుపచ్చ రంగును విడచి, గౌరవర్ణమును దాల్చుట కారంభించును. పెరికిన మొక్కలను, దువ్వెనల వంటి పండ్లుగల యినుప పన్నెలతోఁ జిక్కు దీసినట్లు కువ్వి కాయలన్నిటిని రాల్చి వేసి, కాడల మొకళ్లన్నియు నొక వైపురం జేర్చి కట్టలు గట్టవలయును. కట్టలనన్నిటిని చేర్చి నాలుగడుగులు లోతుగల నీటిలో నడుగున గడ్డి గాదరలను బరచి దానిబూద నిలువుగానిలిపి పయిని గొంచెము బరువెత్తి పది పదునాల్గు దినము లూర వేయవలయును. వానకారున నీటి యందుఁగల వెచ్చదనము చేత కాడలు చక్కగా - మారి నారకును, కాడలోని కర్రకును గల పట్టు వదలిపోవును, పిమ్మట కాడల కట్టలనువిప్పి,