పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సంస్కరణలు, భారీపారిశ్రామిక పార్కులకు అవసరమైన స్థలాలను గుర్తించడం, సేకరించడం, ఎన్ఐఎమ్‌జెడ్స్, సెజ్లు, పిసిసిఐర్ మరియు మెగా పారిశ్రామిక పార్కుల్ని నెలకొల్పడం మీద ప్రత్యేక దృష్టి ప్రస్తుతమున్న పారిశ్రామిక పార్కులకు, పారిశ్రామిక ఎస్టేట్ల కూ పూర్తి స్థాయి సదుపాయాలను కల్పించడం ద్వారా బలోపేతం చేయడం, తద్వారా ఎటువంటి అవరోధాలు లేకుండా పథకాలను అమలు పరచడం ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్యమైన చర్యలు.

151. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 615 కోట్లు ప్రతిపాదించడమైనది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్లు

152. ఈగవర్నెన్స్ మరియు ఐటి రంగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నాయకత్వ స్థితిని సాధించగలిగింది. కానీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటి ఉత్పత్తుల ఎగుమతుల టర్నోవర్లో కేవలం 2 శాతం ఉద్యోగకల్పనలో కేవలం 1.8 శాతం మాత్రమే లభ్యమయింది. కాబట్టి రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత, భవిష్య అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగకల్పనను ప్రేరేపించేవిధంగా కొత్త రాష్ట్రం ఎన్నో చర్యలను చేపట్టక తప్పదని రూఢి అయింది. అంతేకాక ఐటి రంగంలో ప్రత్యక్షంగా కల్పించబడే ప్రతి ఉద్యోగ అవకాశానికీ పరోక్షంగా నాలుగురెట్లు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నది అందరికీ తెలిసిన సంగతే.

153. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 నాటికి సాధించవలసిన నిర్దిష్ట లక్ష్యాలతో ఇ-గవర్నన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి రంగాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ను

47