పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93. నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ సేవలను అందించే విధంగా తృతీయస్థాయి సదుపాయాల కల్పన మీద, విద్యార్థులకు గుణాత్మక వైద్యవిద్యను అందించడం మీద కూడా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది.

94. ఇవి కాక, విశాఖపట్నంలో విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను నిర్వహణలోకి తీసుకురావటం, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షయోజన పథకం క్రింద లభించే ఆర్థిక సహాయంతో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని సదుపాయాలను మెరుగుపర్చడం కూడా జరుగుతుంది. ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహా లో ఒక సూపర్ స్పెషాలిటీ మరియు శిక్షణ సంస్థను భారతప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో నెలకొల్పాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి.

95. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.4,388 కోట్లు ప్రతిపాదించడమైనది.

పాఠశాల విద్య

96. అందరికీ విద్యనందించడం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఎన్నో ముఖ్యమైన పథకాలనూ, కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

97. భారతప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన సర్వశిక్షా అభియాన్ ను రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతతో అమలుచేయడం జరుగుతున్నది. 6-14 సంవత్సరాల మధ్య గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, వారు కనీసం 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసుకునేలా సహకరించడం, లింగపరంగానూ,

32