పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ పథకాలనూ, కార్యక్రమాలనూ సమన్వయపర్చడం ఇందుకొక ముఖ్యమైన మార్గం. అటువంటి సమన్వయాన్ని సాధించే దిశగా సాధారణ బడ్జెట్లో భాగంగా వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించి సమర్పించనున్నాము. వ్యవసాయం, వ్యవసాయప్రాసెసింగ్, మార్కెటింగ్, గిడ్డంగుల నిర్వహణ, పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావుగారు వ్యవసాయానికీ, వ్యవసాయసంబంధిత రంగాలనూ అభివృద్ధి చేయటంకోసం ఒక సమగ్ర వ్యవసాయబడ్జెట్ ను సమర్పించనున్నారు.

సంక్షేమశాఖలు
సాంఘికసంక్షేమం

28. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 84.45 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వారిది 17.1 శాతం. ఒక బహుముఖీన అభివృద్ధి వ్యూహం ద్వారా షెడ్యూల్డ్ కులాల జనాభాకు సాధికారికత సమకూర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

29. ఈ వ్యూహంలో షెడ్యూల్డ్ కులాల బాలబాలికల విద్యాభివృద్ధికి చేయూతనందించడం ప్రధాన కార్యక్రమం. 1445 వసతిగృహాలలో నివసిస్తున్న 1,44,500 విద్యార్థులకు నివాస, భోజన, విద్యా సదుపాయాలకు ప్రభుత్వం పూర్తి తోడ్పాటును అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 177 గురుకుల పాఠశాలల ద్వారా 1,24,000 మంది విద్యార్థులకు గుణాత్మకవిద్యను అందిస్తున్నది. ఈ సంస్థ పాఠశాలలు రాష్ట్రస్థాయి సగటుకన్నా మిన్నగా వరుసగా ఉన్నత ఫలితాలను సాధిస్తున్నది.ఎస్.సి./ఎస్. టి.బి.సి./మైనారిటీల ప్రయోజనార్థం -ప్రభుత్వం నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్ సాధించిన ఉత్తమ

14