పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక వృద్ధి ధోరణుల సమీక్ష

లెక్కలు 2021-22

114. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక ఖాతాలలో రెవెన్యూ లోటు 8,610 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 25,011 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 0.72 శాతంగాను మరియు ద్రవ్య లోటు 2.08 శాతంగాను ఉన్నాయి.

సవరించిన అంచనాలు 2022-23

115. సవరించిన అంచనాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,05,555 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 16,846 కోట్ల రూపాయలు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 29,107 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 47,716 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో వరుసగా 2.21 శాతం గాను మరియు 3.62 శాతంగా ఉన్నాయి.

2023-24 బడ్జెట్ అంచనాలు

116. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, నేను 2,79,279 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,28,540 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం అంచనా 31,061 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 22,316 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 54,587 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 3.77 శాతం గాను మరియు ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉండవచ్చు.

38