పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కారిడార్ (వి.సి.ఐ.సి.) క్రింద కడప నోడ్ యొక్క కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది.

93. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వై.ఎస్.ఆర్. జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాము. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని 'వై.ఎస్.ఆర్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్' ను కూడా అభివృద్ధి చేస్తున్నాము. దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను.

94. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

95. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

రవాణా మరియు రహదారుల మౌలిక సదుపాయాలు

96. రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు మరియు జిల్లాలలోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైనది. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులను మా ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల మరియు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని మా ప్రభుత్వం సాధించగలిగింది.

32