పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87. మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు మరియు మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తోంది. లబ్దిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరియు ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్ మరియు 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద 5,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు

88. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు, అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మన రాష్ట్రం యొక్క పటిష్ఠతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్.టి.పి.సి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, భారత్ బయోటెక్, జి.ఎం.ఆర్. గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్, సెంచురీ ప్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, మరియు అనేక ఇతర ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి.

89. ఈ సదస్సులో 48 దేశాల నుండి రాయబారులు, దౌత్యవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు జపాన్ల నుండి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు మన రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యముపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యు.ఎ.ఇ., నెదర్లాండ్స్, వియత్నాం మరియు పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు

30