పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

మార్చి 16, 2023


గౌరవనీయ అధ్యక్షా!

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను.

దాదాపు ఒక శతాబ్దం క్రితం, శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా వ్రాశారు.

'నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో

మదిని మార్గదర్శనం చేసేలా

ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి చేరేలా

నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రీ'


2. ఈ సందేశం ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమయిన పిలుపు. ఈ సందేశాన్ని మనం అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలం అనే నమ్మకం దృఢపడుతుంది. నాటి భావోద్వేగాలు నేటికీ మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం. 'నా దేశాన్ని జాగృతం చేయండి' అనే చివరి మాటలను 'ప్రపంచాన్ని జాగృతం చేయండి' అనే మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తుంది. ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్యమైన సందేశం. ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని, అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలమనే సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది.

3. ప్రపంచ వ్యాప్తంగా క్లిష్టమయిన సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొని, సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఇందుకు ఒక మహోజ్వల ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర విభజన తరువాత మనము

1