పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు 2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వై.యస్.ఆర్. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ స్థాపన మరియు పనితీరు కొరకు 2021-22 సం॥కి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ యాంత్రీకరణ

18. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలుగల సదుపాయ కేంద్రాలు (M.P.F.C.) అనే భావనను తీసుకువచ్చింది. గ్రామ స్థాయిలో 10,246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫార్మ్ మెషినరీ హబ్ ఏర్పాటు చురుకైన పురోగతితో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సి. హెచ్.సి.లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువలు పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రం (A.M.T.C.) ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 సం॥కి గాను 739.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పశుగణాభివృద్ధి, పాడి మరియు మత్స్య పరిశ్రమ

పాడిపరిశ్రమ అనగానే 'మిల్క్ మాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్యవాక్యాలు గుర్తుకు వస్తాయి.

“అమూల్ అంటే ఏమిటి. ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు. మన గ్రామీణ వ్యవస్థలోని సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇది వేగంగా మార్పు అందించే

9