పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక సాధనం. మన రైతులు వారి స్వంత అభివృద్ధిలో పాలుపంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది. త్రిభువన్ దాస్ గారి తోనూ మరియు కైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనే ఈ విషయం తెలుసుకున్నాను. నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెలు మొదలగు వాటి అభివృద్ధి కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి. అభివృద్ధి సాధనాలను వారి అందుబాటులో ఉంచలేనంత వరకు, అటువంటి అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు, నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించ బడలేనంత వరకు మహిళల మరియు పురుషుల అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల మంచి ప్రభుత్వం అందించ గలిగే మంచి పాలన ఏమిటి? ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని, దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలను అన్వేషించాలి”.

19. 1946 లో కేవలం రెండు డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్, ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా 1 లక్ష 86 వేల పాల సహకార సంఘాలలో 1 కోటి, 66 లక్షల పాల ఉత్పత్తిదారులు ఉన్నారు.

20. డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా, పాల సహకార సంస్థల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం-అమూల్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లోని పాల ఉత్పత్తిదారుల సామాజిక-ఆర్థిక అభివృద్ధే కాకుండా, రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం, పాల ఉత్పత్తిదారులకు తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం, వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులను లభించేటట్టు చేయడం మొదలగునవి

10