పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్ని నవరత్నాల కార్యక్రమాలు మరియు మన మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు వివిధ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో సన్నిహితంగా ఉంటాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

11. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, మన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా, నేను ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ రంగం

మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది. మంచి నీటిని వర్షిస్తుంది. ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు అన్నదాతలకు అమితానందం కలిగించే ఓ వర్షించే మేఘం లాంటివారు. రైతుల మొహాల్లో సంతోషం వెలిగించే ఓ తొలకరి చినుకువంటివారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు. స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. అదే విధంగా అన్నదాతకు అన్నీ తానై, వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రిగారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్రుల రుణం తీర్చుకుంటున్నాం.

డా॥ వై.యస్.ఆర్. రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ యోజన

12. 2020-21 సం॥లో రూ. 13,500 చొప్పున రైతులకు మాత్రమే కాకుండా, కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు (R.O.P.R.) కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వం 1 లక్ష 54 వేల కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల

6