పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(R.O.F.R.) కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51 లక్షల 59 వేల అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడిసాయం అందచేసింది. డా॥ వై.యస్.ఆర్. రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22లో 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను.

డా॥ వై.యస్.ఆర్. ఉచిత పంటల బీమా

13. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దునించే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాలలోకి జమచేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డా॥ వై.యస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకానికి 2021- 22 సంవత్సరానికి 1802 కోట్ల 82 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హతగల అందరు రైతులకు బీమా సదుపాయాలు అందించుటకొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ (A.P.G.I.C.) అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం.

వై.యస్.ఆర్. సున్న వడ్డి పంట రుణాలు

14. బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హతగల రైతుల బ్యాంకు ఖాతాలలోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమచేస్తోంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసి ఉన్న బకాయిలను 51 లక్షల 84 వేల రైతుల ఖాతాలలోకి రూ. 688 కోట్లు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సం॥కోసం, వై.యస్.ఆర్. సున్న వడ్డి పంట రుణాలకై రూ. 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

7