పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్,

గౌరవనీయ ఆర్థికశాఖామాత్యుల వారి ప్రసంగం

20 మే, 2021

గౌరవనీయ అధ్యక్షా!

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను.

మహోన్నతమైన వ్యక్తులు అంటే ఓటమి, బాధ, పోరాటం, నష్టం వంటి లోతులన్నింటినీ చవిచూసి, దాటుకుని వచ్చినవారై ఉంటారు. ఈ వ్యక్తులకు జీవితంపై ఉన్న అవగాహన, సున్నితంగా స్పందించే తీరు మరియు అభినందించే వ్యక్తిత్వం వారిని సౌమ్యమూర్తులుగా, అపార కరుణాహృదయులుగా చేస్తుంది. మహోన్నతమైన వ్యక్తులు ఊరకనే ఉద్భవించరు.

ఎలిజబెత్ కుబ్లెర్-రాస్

1. ప్రతికూలమైన పరిస్థితులను కూడా మానవ నాగరికత అధిగమించిన తీరు చరిత్రలో యుగయుగాల నుండి లిఖింపబడి ఉంది. అత్యంత దుర్భరమైన పరిస్థితులలో కూడా దేశాలు, నాయకుల యొక్క అద్భుతమైన మానవ ప్రయత్నం వలననే మానవ జాతి మనుగడ సాగుతోంది.

2. మానవ చరిత్రలో ఇటీవలి కాలంలో 2020 ఒక మైలురాయి సంవత్సరం అని చెప్పడం తక్కువే అవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా, 780 కోట్ల సంఖ్య గల యావత్ మానవజాతి ఒక ఉమ్మడి శత్రువుతో పోరాడటానికి కలిసి ముందుకు వచ్చారు.

1