పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంధన ఉపయోగితాల పనితీరు దేశంలోనే అత్యుత్తమమైనదని మనకు చెప్పారు. ఆర్ధిక స్థితిగతుల కారణంగా ఎన్టీపిసి నుండి విద్యుత్ సరఫరాను కోల్పోయే ప్రమాదం ఉన్న రెండు రాష్ట్రాలలో ఒకటిగా మనము ఉన్నామని, మన ఇంధన సంస్థలు ఇంతటి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని మేము ఇటీవలే తెలుసుకొని దిగ్ర్భాంతి చెందాం. ఇంధన రంగం ఒక్కదానిలోనే మేము గత ప్రభుత్వం నుండి రూ. 20,000 కోట్ల రుణాన్ని వారసత్వంగా పొందాం.

89. లోపభూయిష్ట పాలన వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో గత ప్రభుత్వం రూ.2,000 కోట్లకుపైగా అధికంగా చెల్లించింది. యూనిట్ ఒక్కింటికి సాధారణ థర్మల్ విద్యుత్ ఒక్కో యూనిట్ కొనుగోలు రేటు రూ.4.2 యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.3.1 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) పవన విద్యుత్తు యూనిట్ ఒక్కింటికి రూ.5.9 (యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.4.8 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) సౌర విద్యుత్ కు యూనిట్ ఒక్కింటికి అత్యధిక రేటు రూ.7.1గా (యూనిట్ ఒక్కింటికి అస్థిర రూ.6 లు మరియు నిర్ణీత రూ.1.1లుగా నిర్ణయించడమయింది) ఉంది. పునర్ వినియోగ వనరుల నుండి ఇంధన ఆవశ్యకతను పొందవలసిన ప్రమాణం 5 శాతంగా ఉండగా, అధిక వ్యయ పునర్ వినియోగ వనరుల నుండి గత ప్రభుత్వం సుమారు 20 శాతాన్ని తీసుకుంది. ఇది మొత్తంగా 8,000 మెగావాట్స్ కు చేరింది. ఈ ప్రభుత్వం పునర్ వినియోగ వనరుల నుండి విద్యుత్తును పొందడాన్ని వ్యతిరేకించడం లేదు. దీనిని వివేకవంతమైన మరియు అర్థవంతమైన విధానంలో చేపట్టాలని చెబుతున్నాం.

90. అయితే, మన మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. కాబట్టి విద్యుత్ అంతరాయాలు ఉండవు మరియు రహదారులు గుంతలు లేకుండా ఉంటాయి. వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం రవాణా వ్యయాన్ని తగ్గించడం మరియు రోడ్డు, రైలు, వాయు మరియు నీటి మార్గాల ద్వారా అన్ని మండలాలు మరియు జిల్లాలలోని అన్ని ప్రధాన గమ్యస్థానాల మధ్య నిరంతర అనుసంధానాన్ని కల్పించడం మా ప్రయత్నంగా ఉంది.

91. అమరావతి రాజధాని నగరం కోసం బడ్జెటులో రూ.500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

31