పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83. వెనుకబడిన జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి వంశధార ప్రాజెక్టు మరియు సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

84. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటుగా రాష్ట్రంలోని సరస్సులు మరియు చెరువులను పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం చర్యలను తీసుకుంటుంది.

85. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు రూ.13,139.13 కోట్ల బడ్జెటును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమ, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగాలు

86. ముఖ్యంగా, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పనే ముఖ్యోద్దేశ్యంగా ప్రత్యేక హోదా సాధించాలనే కృత నిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. ప్రత్యేక హోదా లేకుండా కూడా, పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమలలో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ సమకూర్చడానికి బిల్లును తీసుకువచ్చే ప్రక్రియలో ఉంది.

87. సులభతర వ్యాపార నిర్వహణలో మాత్రమే కాకుండా, వ్యయ ప్రభావక వ్యాపార నిర్వహణకు కూడా మేము ఉత్తమ రాష్ట్రంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంఎస్ఎంఇలపై ప్రత్యేక శ్రద్ధతో, పరిశ్రమలన్నింటి కొరకు ప్రభుత్వం అనవసరమైన నిబంధనలను మరియు ప్రక్రియలను సరళీకృతం చేస్తుంది. క్రొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన సదుపాయాల కల్పననూ అలాగే ప్రస్తుతం ఉన్న యూనిట్లను పునరుద్ధరించడానికి సహాయాన్ని అందించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది.

88. మన రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం, అభివృద్ధి కొరకు విస్తృత మౌలిక సదుపాయాలు అవసరం. గత ప్రభుత్వం, ఎటువంటి అవసరమైన పునాదులు లేకుండానే గాలిలో అనేక కోటలను నిర్మించింది. మన

30