పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందించాలని నిర్ణయించింది. ఈ పెంపుదల వల్ల అన్ని కేటగిరీలలో సుమారు 65 లక్షల మంది పింఛనుదారులు - అనగా 24 లక్షల మంది వయోవృద్ధులు, సుమారు 20 లక్షల మంది వితంతువులు, 6.3 లక్షల మంది దివ్యాంగులు, 1 లక్షమంది నేతకారులు, 27,000 మంది కల్లుగీత కార్మికులు లబ్ది పొందుతారు. డయాలసిస్ రోగుల కోసం పింఛనును నెల ఒక్కింటికి రూ.10,000లకు పెంచడమయింది. ఈ కార్యక్రమం కోసం రూ. 15,746.58 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ ఆసరా

74. నవరత్నాలు అమలులో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2019, ఏప్రిల్ 11 వరకు రూ.27,168 కోట్లు మిగిలిన బ్యాంకు రుణ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించి నాలుగు వాయిదాలలో రీయింబర్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది.

వైఎస్ఆర్ చేయూత

75. ఎస్‌సి, ఎస్‌టీ, బిసి, అల్పసంఖ్యాక వర్గాలు మరియు ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడమయింది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్దిదారుల గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి స్థాయిని చేరుకోవడానికి గ్రామ / వార్డు వాలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా దీనిని అమలు చేయడమవుతుంది. ఎస్‌సి /ఎస్‌టి /బిసి మరియు అల్పసంఖ్యాక సోదరీమణులు వచ్చే సంవత్సరం నుండి ప్రయోజనాలను పొందుతారు.

వైఎస్ఆర్ కళ్యాణ కామక

76. వైఎస్ఆర్ కళ్యాణ కానుక ద్వారా బిసి కులాలకు చెందిన వధువులకు సహాయం అందించడం కోసం వారికి రూ.50,000/-లు వివాహ కానుక ఇవ్వాలని ప్రభుత్వం ఉద్దేశించింది. తద్వారా, 2019-20 సంవత్సర కాలంలో 75,000 మంది బిసి వధువులు ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా

27