పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణ సంక్షేమం

71. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణుల కార్పొరేషనుకు నేను రూ.100 కోట్ల మొత్తం కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంతేగాక, దేవాలయాల నిర్వహణకు తగినన్ని నిధులు లేని అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. 2000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.30,000లతోనూ, 5000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.60,000లతోనూ, 10,000 వరకు జనాభా కలిగిన ప్రతి పంచాయతీకి రూ.90,000 లతో నూ, 10,000 లకు మించి జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి రూ.1,20,000 లతోనూ దూప, దీప, నైవేధ్యం కల్పించేందుకు రూ.234 కోట్లు కేటాయింపుకు నేను ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ బీమా

72. వైఎస్ఆర్ బీమా పథకం క్రింద 18 నుండి 60 సంవత్సరాల మధ్య గల ఎవరేని వ్యక్తి సహజంగా మరణించినట్లయితే, ఆ కుటుంబానికి రూ.1 లక్ష సహాయం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. బిసి, ముస్లి, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన వారితో సహా ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రూ.5,00,000ల సహాయాన్ని అందిస్తాము. వైఎస్ఆర్ బీమా పథకం కోసం రూ.404.02 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

వైఎస్ఆర్ పింఛను కానుక

73. పాదయాత్ర సమయంలో, మన గౌరవ మఖ్యమంత్రిగారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న దురవస్థను చూశారు. వారు రూ.1,000/-ల స్వల్ప పింఛనను పొందుతున్నారు. ఈ మొత్తం గౌరవప్రద జీవనాన్ని సాగించడానికి సరిపోదు. అవ్వ తాతల మనవడిగా మన ముఖ్యమంత్రిగారు పింఛను మొత్తాన్ని రూ.2,250/-లకు పెంచుతూ, దానిని నాల్గవ సంవత్సరం నాటికి రూ.3,000/-లకు పెంచేలా రోడ్ మ్యాప్ ను పొందుపరుస్తూ తన మొదటి ఫైలుపై సంతకం చేశారు. అంతేగాక, ఈ ప్రభుత్వం వయో పరిమితిని 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించింది. సంతృప్తి స్థాయి ప్రాతిపదికన పింఛన్లను

26