పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితోపాటు భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను, 17,768 మంది భూమిలేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములను మా ప్రభుత్వం అసైన్ చేసింది.

140. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే, భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణను చేపట్టటం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు, మా ప్రభుత్వం యొక్క ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయి.

ఉద్యోగుల సంక్షేమం

141. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాల అమలులో, ప్రజా సేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత, మరియు నైపుణ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలుచేయడానికి ఎంతో అవసరమని గుర్తించింది.

142. మా ప్రభుత్వం గత ఐదేళ్ళలో 4 లక్షల 93 వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్య కాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డి.ఎస్.సి. (DSC) ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్ళు-2022 క్రింద కనీస వేతన స్కేళ్ళను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై APCOS (ఆప్కాస్) సంస్థను ఏర్పాటు చేశాం. 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేసాము. 11వ వేతన సవరణ సంఘ సిఫారసులను అమలు చేసాము. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరాలకు పెంచాము.

37