పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించటానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ ఐదేళ్లలో, అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలతో మన రాష్ట్రము అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించటంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు.

137. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాలను డిసెంబర్ 21, 2020న మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రిఫరెన్స్ స్టేషన్ల (CORS) సాంకేతికతను ప్రవేశపెట్టటం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతున్నది.

138. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారులకు భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2022 రూపొందించబడింది. ఇప్పటివరకు 17 లక్షల 53 వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు 4 లక్షల 80 వేల మ్యుటేషన్లను పరిష్కరించటం జరిగింది. అంతే కాకుండా 45 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కరించ బడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించటం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి. మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయగలుగు తున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడంవలనే సాధ్యం అయినది.

139. మా ప్రభుత్వం 1 లక్ష 37 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములు, 1 లక్ష 13 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతోపాటు, రిజిస్ట్రేషన్ చట్టం- 1908 లోని నిషేధిత ఆస్తులు u/s 22(A) నుండి భూములను తొలగించింది. షరతుగల పట్టా భూములు 33,428.64 సెంట్లు, 2 లక్షల 6 వేల ఎకరాల చుక్కల భూములు, 1 లక్ష 7 వేల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం క్రింద 22,837 సెంట్లు, 22,346 మంది భూమిలేని పేద షెడ్యూలు కులాలకు

36