పుట:ఆంధ్రపదనిధానము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈగ్రంథమును ముద్రించుపట్ల ప్రత్యేకశ్రద్ధ గైకొన్న బెజవాడ భవానీముద్రణాలయమువారికిఁ దొలుత కృతజ్ఞత దెలుపుట మాప్రధానధర్మము.

ఆంధ్రపదవిధానమును ముద్రించి బ్రచురించినచోఁ బితౄణవిముక్తు లగుటయెగాక యాంధ్రలోకోపకారు లగుదురని చెప్పినంతన వ్యయభారమున కోర్చి గ్రంథప్రకటనమునకు దోడ్పడిన తూము రంగయ్యగారికిని — అభిమానపూరితులై ముద్రితభాగములఁ బరిశీలింపుచు సంస్కరణముల కానందించుచు మాకు బ్రోత్సాహ మిచ్చిన తూము వరదరాజులుగారికిని — సంతోషపూర్వకముగ ధన్యవాదముల నొనర్చుచున్నారము.

పితృగౌరవము నూతగఁగొని యీయుత్తమగ్రంథము ప్రకటించి తమపితృవరుఁడగు రామదాసకవి శ్రమ సార్ధక మొనర్చిన తూము రంగయ్య, సర్వేశము వరదరాజులుగారల యుదారభావముపై నింకఁ గొంతగ్రంథప్రచురణ మాధారపడియున్నది.

నందిగామ,

ఇట్లుభాషాసేవకులు,

శుక్ల సం॥ మాఘ బ ౧౨

శేషాద్రిరమణకవులు,

శతావధానులు.