పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భేదంబులవలనను నన్నియుఁ బ్రత్యేకంబుగాఁ గూడుకొన
మున్నూట యిరువది నాలుగు మండలంబుల పర్యంతంబు
గలిగిన మండలభేదంబులు బహుప్రకారంబులుగా బహుమతం
బులవారలు పలుకుచుందు రయినను సకలమతసమ్మతంబును
సకలలోకప్రసిద్ధంబును సకలలోకవిజ్ఞాతంబునైన యది
యీ ద్వాదశరాజమండలంబే యగు నది యెట్లనిన.

12

ద్వాదశరాజమండలము

సీ.

అరియును మిత్రుండు నరిమిత్రుఁ డవ్వల
            నహిత మిత్రామిత్రుఁ డహితమిత్ర
మిత్రుండు ననఁగ భూమీపతులైదుగు
            రల విజిగీషువు నగ్రమునను
వెనుకఁ బార్ష్ణిగ్రాహుఁ డనియెడు నాతండు
            నాక్రందుఁ డనురాజు నవలి వంక
యందుఁ బార్ష్ణిగ్రాహకాసారుఁ డాక్రంద
            కాసారుఁడన నల్వు రవనినాథు


గీ.

లరిజిగీషులభూములయండనుండు
మధ్యముఁడు వారిచెంతను మనుపఁ గట్ట
కడ నుదాసీనుఁ డన్నిట ఘనుఁడు దీనిఁ
దెలియ ద్వాదశరాజమండల మటండ్రు.

13


గీ.

మఱియు మిత్రుఁ డుదాసీనమనుజపతియు
నరియునన నింతమాత్రనే యగుచు నుండు
మండలము పతి కీరితి మండలంబు
సొరిది గెలుచుటె మండలశుద్ధి యండ్రు.

14