Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వైరిమీఁదట దండెత్తవలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.

14


వ.

కూటపుమూఁకలకు.

15


సీ.

కడు నధికంబుగాఁ గలిగిన యదియైనఁ
             దనవెంటఁ దొడుకపో నొనరెనేని
చెలఁగుచు బడలికల్ చెందని యదియైన
             బహుముఖంబులుగాక పరగియున్న
చేరువదండైన చేకొద్దియై కార్య
             మప్రయాసంబున నగుచునున్న
శత్రుఁడు కొంచెపుసైన్యంబుతో నున్న
             నేమరుపాటున నెసఁగియున్న


గీ.

నెట్టిచోటున మోసంబు నెనయకుండు
జాడఁ గూటపుమూఁకలతోడఁ గూడి
వైరిమూఁకల దండెత్త వలయు నెందు
దండయాత్రావిధిజ్ఞుఁడౌ ధరణివిభుఁడు.

16


వ.

మిత్రసైన్యమునకు.

17


సీ.

తనమిత్రసైన్యంబు ఘనమైనయదియైన
             ననికిఁ దెచ్చుటకుఁ దా నర్హమైనఁ
దడవుగాకుండెడి దండైనమాత్రంబు
             వలననే దాడియుఁ గలహములును
దఱచుగా గలుగక తనకుఁ జేకూడిన
             కార్యంబు సమమైనఁ గలుగు ఫలము
మిత్రునధీనమై మెఱసి చేరెడిదైన
             నరిసీమ చెఱిపెడు నట్టిదైనఁ