పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

సేనాపతులను బురిఁగల
మానవులను దనదుసీమ మనుమానవులం
దా నొనగూర్పఁగ వలయును
దానమునకు భేదమునను ధరణీశుఁ డిలన్.

169


చ.

కలఁకలు బుట్టఁజేసి తిరుగంబడియుండుకులంబువారి చెం
తల గడినుండురాజుల వనంబుల [1](నుండెడివారి భేదపుం
జెలువున దండవైఖరిని) చిక్కగఁ జేయఁగ నొప్పునేరుపుల్
బలియఁగ నన్యులం దగునుపాయముచేఁ జను మట్టుపెట్టగన్.

170


వ.

ఇది చతురుపాయస్వరూపంబగు నింక మాయోపేక్షేంద్రజాలంబుల
ప్రకారంబులు గ్రమంబున వివరించెద.

171

మాయాప్రకారములు

సీ.

జనులు కంబములలోనను దేవతాప్రతి
            మలలోపలను జొచ్చి మెలఁగుటయును
గాంతాదిరూపముల్ గైకొనుటయు రాత్రు
            లందుఁ జీఁకటుల మహాద్భుతముగఁ
గొరవిదయ్యముల బాగున మించుటయును భే
            తాళుని చందంబుఁ దాల్చుటయును
బులుల నక్కల యెలుఁగుల రూప మొందుట
            యివి మనుజులమాయ లెంచి చూడఁ


గీ.

గామరూపంబుఁ బూను టింగలము నంప
కోలలును రాళ్ళు నీళ్ళును గురియుటయును
గాలి గట్లును మొగిలు చీకట్ల గలుగఁ
జేయుచుండుట దేవతామాయ యగును.

172
  1. (...................)