పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

నిట్టిభేదంబు లెల్లఁ దా నెపుడు చిత్త
మం దెఱిఁగియుండ నేర్చినయట్టిరాజు
మదరిపుల గెల్చి సకలసంపదలఁ బొల్చి
జనులు వినుతించ మించి యీజగతి నేలు.

144

ద్వైధీభావప్రకరణము

వ.

మఱియు ద్వైధీభావంబు స్వతంత్రపరతంత్రభేదంబున రెండు
దెఱంగు లయ్యె నందు స్వతంత్ర ద్వైధీభావం బెట్లనిన.

145


సీ.

ఇరుదిక్కులకుఁ దన కిద్దఱుశత్రులు
           బలవంతులై యున్నఁ గలఁకపడక
వారివారికిఁ జూడ వారివాఁడును బోలెఁ
           దన్నుఁ దక్కోలుగా నెన్ని పల్కి
కాకాక్షివలె నిరుగడల వర్తింపుచు
           నందుఁ జేరువదాన నధికయత్న
మున గడుపుచు నిద్ద రెనయక యొత్తిన
           నందులో బలవంతు నాశ్రయించి


గీ.

వార లిద్దఱు వదలిన వారియరులఁ
దాన బలవంతు నొక్కనిఁ బూని కొలిచి
నడపఁగా నేర్చి కాలంబు గడపెనేని
యది ద్విదాభావగుణ మని యండ్రు బుధులు.

146


క.

సాధారుణుఁడై యిరుగడ
భూధవులకు నెనసి ధనముఁ బొరయుట యది దా
నీధారుణిఁ బరతంత్ర
ద్వైధీభావం బనంగఁ దగుఁ దజ్‌జ్ఞులచేన్.

147