పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

కడఁగి దండెత్తిపోయి తా విడిసియుండు
నది ప్రసంగాసనం బన నమరుచుండు
నిట్టి చందంబు లెల్లఁ దా నెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

142


సీ.

అరిజిగీషువులఁ దా నాక్రమించుటకు మ
           ధ్యముఁడు పై దండెత్తఁ దలచినప్పు
డరియును విజిగీషు నన్యోన్యమైత్రిచే
           నొనగూడి బల్మిచే నుండు టొప్పు
నదిగాక ఘనుఁడైన యల యుదాసీనుండు
           గినిసిన నరివిజిగీషువులను
దక్కినవారెల్ల నొక్కటైయున్న సం
           భూయాసనం బనఁ బొలుపు మీరు


గీ.

నిట్టిభేదంబులెల్లను నెపుడు చిత్త
మం దెఱుఁగ నుండ నేర్చిన యట్టిరాజు
మదరిపుల గెల్చి సకలసంపదలఁ బొల్చి
జనులు వినుతించ మించి యిజ్జగతి నేలు.

143


సీ.

బలియుఁడై కృష్ణుండు పారిజాతముఁ దెచ్చు
            చోట నుపేక్షించి సురవిభుండు
పదరకయున్నట్లు పగతుఁడు బలియుఁడై
            యున్నచోఁ దా నూరకుండునదియు
నొకహేతువునఁ జేసి యొకశాత్రవుఁడు పేర్చి
            తను నుపేక్షించినదానిఁ గొనుచు
మును రుక్మి యుండిన యనువున నుండుట
            యది యుపేక్షాసన మనఁగ దనరు