పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

నిట్టి నయరీతి నెంతయు నెఱిఁగి నృపతి
వైరిఁ జెఱిపెడికొఱకునై వైరికులజుఁ
డైనవానినె పట్టి తా నాప్తుఁ జేసి
కొనుచు మెలపున జయముఁ గైకొనఁగవలయు.

41


క.

ఏకార్యముఁ జేయంగాఁ
జేకొనఁ దనమండలంబె చెడుబా టగుఁ దా
నాకార్య ముడుగవలయున్
గైకొన్నధరాతలంబుఁ గడు రంజిల్లన్.

42


క.

దానమున సామమున స
న్మానమున న్మెలగఁ జేయఁదగుఁ దనవారిం
బూనుకొని భేదదండవి
ధానమ్ములచేతఁ బరులఁ దండిపఁ దగున్.

43


వ.

ఇది శత్రుమండలవర్తనప్రకారం బింక మిత్రమండలవర్తన
ప్రకారంబు వివరించెద.

44

మిత్రమండలవర్తనప్రకారము

క.

క్రమమున హితాహితుల లో
కము నిండుచునుండు సములు గలరే యిది ని
క్కమపో 'సర్వస్స్వార్థం
సమీహతే' యనఁగఁ బరగు శాస్త్రముకల్మిన్.

45


గీ.

భోగ మంది వికారంబుఁ బొందెనేని
యెంచి చుట్టంబునైన నొప్పించవలయు
మిగులఁగఁ వికార మొందినఁ దెగి వధింప
వలయు నిలఁ బాపకర్ముండు వైరి గాన.

46