పుట:అహల్యాసంక్రందనము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39

శా. రేరాజున్ నగుమోముతో వనరుహశ్రీఁ గేరుకందోయితో
     బారన్ గొల్వఁగవచ్చు పెన్నురముతో బాగైన నెమ్మేనితో
     'నీ రాజెవ్వఁడు సానురాగమున నన్నే చూచుచున్నాఁడు మే
     లౌరా సోయగ'మంచు జిష్ణువు నహల్యాభామయున్ గన్గొనెన్.32
క. అప్పుడు పూర్వకకుప్పతి
     తప్పక యత్తరుణిఁ జూచె తరుణీమణియున్
     ఱెప్పల నార్పక చూచెన్
     గుప్పెన్ మరుఁ డిద్దఱన్ లకోరులచేతన్.33
క. జగముల నన్నిటి నేలుచు
     నగణితసౌందర్యవిక్రమైశ్వర్యములన్
     బొగడొందెడు తనకంటెను
     మగువకుఁ దగినట్టి వేఱె మగఁడుం గలఁడే.34
చ. అని తనుఁజూచి తోడనె యహల్యను గాంచి సభాసదావళిన్
     గనుఁగొని తాను వేఁడునెడఁ గాదనఁడంచు సురేంద్రుఁ డిట్లనున్
     “వనరుహగర్భ మీమహిమ వర్ణనసేయఁ దరంబె యద్భుతం
     బనుపమ మక్షిభాగ్యఫలమై సృష్టి యొనర్చి [1]తింతలోన్.35
ఉ. చక్కఁదనాలకుప్పయగు చక్కెరబొమ్మను సృష్టి చేయుటే
     యెక్కువగాదు దీని మది కింపగు నాథుని నిర్ణయించినన్
     జక్కనితారతమ్యములు సర్వ మెఱుంగుదు వైనఁ దెల్పెదన్
     దక్కొరు లెవ్వరుం[2]గలరు తన్వికి నేనొకరుండు దక్కఁగన్.36
క. నరులన్ గిన్నరులన్ గిం
     పురుషులఁ జారణుల సిద్ధపురుషుల ఋషులన్
     బరికింపుము వీరలలో
     విరిబోఁడికిఁ దగినవాఁడు వీఁడని చెపుమా!37

  1. రింతలోన్
  2. దగరు