పుట:అహల్యాసంక్రందనము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

అహల్యాసంక్రందనము

ప్రథమాశ్వాసము

.

     శ్రీ సొబగొందు నిందుసర
                      సీసరసీరుహకేసరద్యుతిన్
            వీసరవోక మీసరపు
                      నిగ్గుల జగ్గుల దుప్పటిన్ దటి
            ద్భాసితనీలమేఘ మన
                       భాసిలు రంగనివాసుఁ గౌస్తుభో
            ల్లాసు రమాధివాసు సవి
                       లాసమతిన్ నిరతిన్ నుతించెదన్.

ఉ. రంగమహీశుకొమ్మ జిగిరంగులబంగరుబొమ్మ సంపదల్
     పొంగుచు నిచ్చు గుమ్మ పతిఱొ మ్మెడబాయని ముద్దుగుమ్మ య
     య్యంగజుఁ గన్నయమ్మ శరణార్థికి వేలుపు మ్రానికొమ్మ నె
     మ్మిం గరుణించి యిచ్చు నెలమిన్ గలిమిన్ బలిమిన్ దిరంబుగన్.2