పుట:అహల్యాసంక్రందనము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్రితజైమినిభారతపీఠికలో ఉంది. లోకం అంతటిదీ ఒకేరుచి కాదని, మనకు సిద్ధాంతంగా అంగీకారం అవుతున్నప్పుడు, ఒకేఒకరు, అభిరుచి విషయంలో ఆధారం లేకుండా యావత్తు లోకానికీ ప్రాతినిధ్యం వహించడం అంతసజావు కాదేమో; ఏమైనప్పటికీ, ఉన్న ఆ ఒక్కప్రతినే ఆధారంగా చేసుకొని, వీలైనంతవరకు స్ఖాలిత్యములు రానీకుండా, పరిషత్తువారు విడిచివేసిన భాగం ఈ సంపుటంలో ముద్రించినందువల్ల, స్వల్పగ్రంథపాతములు మినహాగా, జై మినిభారతము[1] ఇంచుమించు సమగ్రంగా, లభించే అవకాశం కలిగింది. వెంకటకృష్ణప్పనాయకుని రచనను - అనౌచిత్యము, అశ్లీలత - వీని కెడమీయని భాగాన్ని అకారణంగా, త్రోసివేసే రసనీరసత్వం లోకులకు అంటగట్టడం భావ్యము కాదుగదా!

——

  1. ఇది అయిదాశ్వాసముల వచనకావ్యము... ఈకవి అధ్యాయక్రమమున గద్యము వ్రాయుటబట్టి సంస్కృతాశ్వమేధపర్వమును గూడ చూసినాడని చెప్పవలసి వచ్చినది. కాని, వచనరచనమంతయు, బదములు వాక్యములు సమాసములు ప్రయోగించుటలో, గూడ, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని పద్యకావ్యమునే వచనశైలిలో వ్రాసెనని చెప్పగలదు. కాని, కవి యందందు, విశేషముగా శృంగారవర్ణనాసందర్భములందును సామాన్యముగా యుద్ధవర్ణములయందు, నాసంస్కృతాంధ్రకావ్యములను రెంటిని గూడ మీఱి, యథేచ్ఛముగా గల్పనము గావించి, స్వకవిత్వమును గూడ గొంతవర కిందు జొనిపెను. మఱియు మూలమును, నాంధ్రపద్యకావ్యమును గూడ మీఱి వర్ణనాతీరేకంబునను, గథితకథనంబునను గ్రంథ మామూలాగ్రముగా బెంచి వ్రాసెను...

    [— జైమిని భారత పీఠిక ]