పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

అష్టాంగయోగసారము

క. ఉపశాంతి లేని మనుజుల
    జపతపములు యోగవిధులు సవనాదు లిలన్
    గపటములై చెడుఁ గావున
    నుపశాంతియ పరమధర్మ ముత్పలనేత్రా.
సీ. అని వరాహస్వామి యష్టాంగయోగసా
        రార్థముల్ భూదేవి కధికదయను
    జెప్పినాఁ డని సూతుఁ డప్పు డాశౌనకా
        దులకు బోధించె సంతోష మెసఁగ
    నని యిట్లు తరిగొండ హరికటాక్షమున సు
        బ్రహ్మణ్యగురుకృపన్ బన్నగాద్రి
    విభుచెంత నింజేటి వెంకమాంబ వసించి
        యీ కృతి రచియించె నిదియు వ్రాసి
గీ. చదువువారును వినువారు జన్మకర్మ
    జలధిఁ దరియింతు రీకథ సార మగుచు
    శ్రీగురు పదాబ్జయుగళి కర్పితము నగుచు
    నుర్విమీఁదఁ బ్రకాశించి యుండుగాత.

శ్రీగురుబ్రహ్మార్పణ మస్తు

తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రెస్, తిరుపతి ప్ర. 250, 30_3_55.