పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

33

బాహ్యమందు విస్తరిల్లక సుస్థిరంబై మాయాజాలం బనిత్యం బని సత్యవస్తు వందు బొందుచున్నప్పుడు బహిర్జ్ఞప్తి వచ్చిన తెప్పున నంతర్ముఖంబై జగం బనిత్యంబుగా నాత్మ సత్యంబుగా నెఱింగి నిత్యబోధ నొంది యుండుటే సుషుప్తి యగు. జీవేశ్వరభావంబుల నొందు నాత్మయందు నిలిచిన మనంబు బాహ్యభావరహితంబై పరంబును భావించు నిట్లు పురుష పురుషోత్తమ భావంబుల నుభయాత్మకంబైన చైతన్యంబునం బొంది యమ్మనంబు విషయవాసనావిముఖంబై సర్వేంద్రియవ్యాప్తులతోడ దేహాభిమానంబు మఱచి విరక్తిమార్గంబున సంసారబంధవిముక్తమై ఆత్మానుభవామృతపానంబునం జొక్కి తన్మయంబై స్వతంత్రతఁ బాసి ఆత్మ పరతంత్రం బగుచుండు, నంత జీవుండు నస్వతంత్రుఁడై యీశ్వరాధీనుం డగుచుండగా నీశ్వరభావంబు సత్యంబగు నప్పుడు సర్వమయుండైన పరమేశ్వరునియందు మనం బుపరతం బగుచుండు నప్పు డాత్మయం దొకమనోదృశ్యంబగు నందాక మనోన్మని యగు, నెప్పుడు ద్రష్పదృగ్దృశ్యంబులు లేక తాను తానై ధ్యానవిరహితంబై చిన్మాత్రంబైన యెఱుకఁ దానె సత్తామాత్రం బగుచుండు నప్పుడు మనంబు కలదు లేదనరాకుండు నది యున్మవ్యవస్థయైన తుర్యంబగు, నది స్వరాట్టును పరమపదంబు నగుచుండు, నందు సహజంబుగా మానసంబు సకలేంద్రియప్రాణానిలంబులతోడ లీనంబగుట నది యమనస్కంబైన తుర్యాతీతం బగుచుండు. కలదు లే దనరానిదై ఘటాకాశంబు మహాకాశంబునం బొందిన ట్లేకంబై దేశ కాల కార కర్తృ కారణ గురుత్వ లఘుత్వాద్యవస్థలు తోచకున్న నది సహజమనస్కంబగు. పట్టువిడుపు లేనిదై చెప్పఁ జూపరాక సహజభావంబై యున్న నది యజాడ్యనిద్రయగు. కడగన రాని నిస్తరంగసముద్రంబు తెఱంగున నాద్యంతరహితంబైన నభంబు కరణి నింతింతనరాక తనంతనె నిండి మలయజమందు గంధంబును, వృక్షంబునం దనలంబును నిక్షుదండంబునందు మధురంబును క్షీరంబునందు ఘృతంబును తిల