పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

అష్టాంగయోగసారము

గీ. నదియె ఘనశాంభవీముద్ర యగుచు నుండు
    రెండుజాముల దనుక గూర్చుండి దీని
    నభ్యసింపంగ మానసం బనిలగతులు
    నిలుచు నేకాగ్రభావమున్ నిలుచు నపుడు.

రాజయోగము

సీ. వినుకులన్ బలుకులన్ వివిధచిత్రములైన
        తలఁపులఁ దనయందె నిలిపికొనుచు
    నల పరమాత్మయం దంతరాత్మను గూర్చి
        తా నందే లీనమై తగ నివాత
    దీపంబు కైవడి తేజరిల్లుచు నిస్త
        రంగాబ్ధివలె నంతరంగమందు
    కనఁ డొకరూపంబు వినఁ డొకశబ్దంబు
        మొనసిన ఖేచరీముద్ర నంటి
గీ. యచలితానందరసమగ్నుఁ డగుచుఁ జొక్కి
    వరమనోన్మనీయున్మ్యవస్థ లొంది
    చలనరహితామనస్కంబజాడ్యనిద్ర
    యోగనిద్రయు నా రాజయోగి పొందు.

వ. అట్టి రాజయోగికి జాగ్ర త్స్వప్న సుషిప్తి తుర్య తుర్యాతీతంబు లను పంచావస్థలు గల వవి యెయ్యవి యనినఁ జతుర్వింశతితత్త్వాత్మకంబెన దేహంబు తాఁగానని పంచవింశకుండైన దేహి తానని తెలిసినది జాగ్రత్త యగు. మనంబు నింద్రియబృందంబుతోడ నాత్మయందు బొందించి ధ్యానింపగా నమ్మనంబు సర్వవిషయవాసనాసంగరహితమై బాహ్యాంతరంబుల మెలంగుచు కేవల బహిర్ముఖంబుగాక తన్ను దాను తరచుచుండుట స్వప్నం బగు, నిది యభ్యసింపుచున్న మనంబు