Jump to content

పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

యోగియైన నాని కెప్పుడు దేహమును విడువ నిచ్చపొడమునో అప్పుడతఁడు " ఓం నమో వేంకటేశాయ ' యను 'వేంకటేశాష్టాక్షరిని రపించవలయును. అప్పుడు ప్రాణవాయువు బ్రహ్మరంధ్రమునుండి వెడలి అర్చిరాదిమార్గమున పరమపదమును బ్రవేశించి శ్రీవేంకటేశ్వర సాయుజ్యమునంది చిరమఖండానందము ననుభవించును.

యోగులగు వారి కనుభవముననున్న యీ యోగ విషయ మీ చిన్న పొత్తమునఁ జక్కఁ బొందుపరుపబడి పాఠకుల శాధ్యాత్మిక జిజ్ఞాసను బొడమచేయుచున్నది. ఇట్టి గ్రంధముల నెన్నే నచ్చోత్తించు దేవస్థానపుటధికారుల ప్రయత్నములును ముదావహములు.

ఇట్లు పం. బాలకృష్ణమూర్తి.