పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పదపడియదశయందున
రదనంబులు నాలుగేండ్లు ప్రథమం బదిగా
గదియును వ్యంజనము తొ
మ్మిదియును మూడేసియేళ్ళు నిది యొక్కొకటై.

43


పండ్లు తోచినవత్సరము గానక మరివాలుగువత్సరము గడచినపిమ్మట వ్యంజనములు ప్రారంభమగును. ఒక్కొక వ్యంజనము మూడేండ్ల చొప్పున తొమ్మిది నడచును.


వ.

అది యెట్లనిన కృష్ణవ్యఃంజనంబును మక్షికావ్యంజనంబును శంఖవ్యంజనంబు నులూఖలవ్యంజనంబును చలనవ్యంజనంబును పతనవ్యంజనంబును... ననం దొమ్మిది దెరంగులై యుండు, తరంగమ వయోజ్ఞానకారణంబులై యొప్ప తద్వ్యంజనంబులు వేరవేర వివరించి చెప్పెద.

44


1 కృష్ణవ్యంజనము 2 మక్షికావ్యంజనము 3 శంఖవ్యంజనము 4 ఉలూఖలవ్యంజనము 5 చలనవ్యంజనము 6 పతనవ్యంజనము అని తొమ్మిదివ్యంజనము లుండును. ఒక్కొకటి మూడేండ్లు నడచును.
నవవ్యంజనంబులును జెప్పి యొక్కవ్యంజనరూపంబును వేరువేర నిరూపింతునని జెప్పుచున్నాడు.


క.

తనభాయంకృష్ణవ్యం
జన యారవయేట బుట్టు పెద్దశనయుగం
బున నేడవమధ్యంబున
మొనయు హరిపోరిపక్షముల నెనిమిదియున్.

45

కృష్ణవ్యంజననిరూపణము

గీ.

అశ్వరత్నంబు మునుపళ్ళు హయము నడిమి
పళ్ళతురంగముకడ పతిపళ్ళకడను
క్రమముతో నవమాదివర్షములమూట
హరిణి విలసిల్లు రాయచోహత్తిమల్ల.

46