పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

జన్మమాసంబున శనియుగమువడము
             పొడమి రెండవనెల పూర్ణమగును
మధ్యమదంతయుగ్మంబు మూడవ నెల
             పొడమి నాల్గవనెల పూర్ణమగును
పారిపక్షపుజోడు పరగ నేనవనెల
             పొడమి నారవనెల పూర్ణమగును
తెలుపు వేడవనెల పొలుపారు క్రిందట
             మొదలనుగా నెనిమిదవనెలయు
నవదశమాసములును దా పెదనిక్రింద
మీదిమద్యములు దెలుపు మీరినయిలు
బదునొకండును పండ్రెంట గోడిగలకు
బారిపక్షము లట్ల గుమారచంద్ర.

40


చ.

క్రమమున నొక్కయేడున తురంగము శాలసమూహి కెల్ల దం
తములు సమస్తముల్ ధవళతామహిమం దనరారుచుండగా
నమరు గషాయవర్ణమున రెండవయేట... న
త్యమలయశోవిభూషిత సమస్తదిగంతరకంపభూవరా.

41


తురంగశాబకమునకు యొకయేడు నిండునంతకు దంతంబులన్నియును దోచుటయెగాక యవి తెల్లనైయుండు రెండువత్సరముల కయ్యవి కషాపురంగు గలిగియుండును.


క.

మూడవేటను వద్దశనములు చతుర్ధ
హాయనంబున మధ్యదంతాంకురములు
పంచమాబ్దంబునను బారి పక్షయుగము
సొరిదిబడి వచ్చుపిల్లల కరనె యధిప.

42


మూడవయేటను దశనంబులును, నాలవవత్సరమధ్యంబున మధ్యదంతములును అయిదవయేట పారిపక్షములును దోచు.